పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). చాలా రోజులుగా రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది డైరెక్టర్ క్రిష్ టీం. హరిహరవీరమల్లు మేజర్ యాక్షన్ పార్ట్ పూర్తయింది. ఈ విషయాన్ని యాక్షన్ కొరియోగ్రఫర్ విజయ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. నిరంతరం మద్దతు అందిస్తున్న కల్యాణ్ బాబుకు, మీరందిస్తున్న ప్రశంసలు, ప్రేమకు ధన్యవాదాలు. ఇపుడు తర్వాతి సీక్వెన్స్ కోసం ప్రిపరేషన్ మొదలైంది..అని విజయ్ అప్డేట్ అందించారు.
పవన్ కల్యాణ్ నుంచి దేవుడి ప్రతిమను అందుకుంటున్న స్టిల్స్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు విజయ్. ఇపుడీ ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. మేఘసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.. ఈ చిత్రాన్ని 2023 వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కాగా మరోవైపు పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ డిసెంబర్ 11న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంఛ్ అయిన విషయం తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వై రవిశంకర్ , నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు.
పవన్ కల్యాణ్‌తో యాక్షన్ కొరియోగ్రఫర్ విజయ్..
Read Also : Thegimpu | తునివు తెలుగు పోస్టర్‌తో రిలీజ్ అప్డేట్
Read Also :Bedurulanka 2012 | సస్పెన్స్‌గా కార్తికేయ బెదురులంక 2012 గ్లింప్స్ వీడియో