Thegimpu | తునివు తెలుగు పోస్టర్‌తో రిలీజ్ అప్డేట్
తునివు (Thunivu).. నో గట్స్ నో గ్లోరీ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ మూవీ తమిళ్లో (పొంగల్ 2023) కానుకగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. తెలుగులో కూడా థియేటర్లలో సందడి చేయబోతుంది. తెగింపు తెలుగు పోస్టర్‌ను విడుదల చేస్తూ అప్డేట్ అందించారు మేకర్స్.
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) హెచ్ వినోథ్ (H Vinoth) కాంబినేషన్లో వస్తున్న చిత్రం తునివు (Thunivu). తెలుగులో తెగింపు టైటిల్‌తో విడుదల కానుంది. నో గట్స్ నో గ్లోరీ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ మూవీ తమిళ్లో (పొంగల్ 2023) కానుకగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. తెలుగులో కూడా సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయబోతుంది. తెగింపు తెలుగు పోస్టర్‌ను విడుదల చేస్తూ అప్డేట్ అందించారు మేకర్స్.
తమిళనాడులో విజయ్ నటించిన వారిసు సినిమా కూడా పొంగల్ కు విడుదలవుతుంది. రాధాకృష్ణ, ఐవీవై ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి.తునివు బాక్సాఫీస్ వద్ద వారిసుతో పోటీ పడనుంది. తునివు చిత్రంలో మలయాళ భామ మంజు వారియర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఈ చిత్రానికి డైరెక్టర్ గిబ్రాన్ (Ghibran) మ్యూజిక్ అందిస్తున్నాడు. తునివు చిత్రాన్ని భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో జీస్టూడియోస్-బోనీకపూర్ సమర్పణలో బోనీకపూర్ నిర్మిస్తున్నారు. తునివు చిత్రంలో సంజయ్ దత్, సముద్రఖని, మహానంది శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి భారీ చిత్రాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి విడుదలవుతున్నాయి. విద్యా వాసుల అహం కూడా సంక్రాంతి రేసులో ఉంది. ఈ నేపథ్యంలో వారసుడు, తెగింపు చిత్రాలకు ఎన్ని థియేటర్లు దొరుకుతాయనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
Proud to announce our Andhra Pradesh and Telangana distributor @Radhakrishnaen9 @IVYProductions9 #ThunivuPongal #Thunivu #NoGutsNoGlory#Ajithkumar #HVinoth@boneykapoor @bayviewprojoffl @kalaignartv_off @netflixindia #RomeoPictures @mynameisraahul @sureshchandraa @nirav_dop pic.twitter.com/r07R94QKZp
— Zee Studios (@ZeeStudios_) December 21, 2022
చిల్లా చిల్లా లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

