Game Changer | రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer) విడుదల రోజే పైరసీ (Piracy) విషయంలో చిత్రయూనిట్‌కు బెదిరింపులు వచ్చాయని తెలిసిందే. పలు చోట్ల ఆన్లైన్లో సినిమా ప్రింట్ షేరింగ్స్ కూడా జరిగాయి. పైరసీ కావడంపై మూవీ టీం సైబర్ క్రైమ్ విభాగాన్ని కూడా ఆశ్రయించింది. విడుదల రోజే పైరసీ రావడంపై గేమ్ ఛేంజర్ టీం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా గేమ్ ఛేంజర్ ఏకంగా లోకల్ టీవీ ఛానెల్లో ప్రసారం కావడం గేమ్ ఛేంజర్ టీంను ఆందోళనకు గురి చేసింది. ఈ సినిమా వచ్చి వారం కూడా కాకుండానే లోకల్ ఛానల్లో ప్రసారం అయ్యింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ కూడా చేశారు నెటిజన్లు. ఏపీలోని కాకినాడ ప్రాంతంలో సినిమాను లోకల్ ఛానెల్లో ప్రసారం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అప్పలరాజు అనే వ్యక్తిని గాజువాకలో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ విషయమై ఇప్పటికే టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస కుమార్ (ఎస్కేఎన్) ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఒక సినిమా వెనక కొన్ని వేల మంది శ్రమ దాగి ఉంటుందని తెలిపారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఒక సినిమా విడుదలై 4 నుంచి 5 రోజులు కాకుండానే లోకల్ కేబుల్ ఛానల్‌తో పాటు బస్సుల్లో ప్రసారం చేస్తున్నారు. ఈ విషయం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. సినిమా అంటే కేవలం దర్శకుడు, హీరో, నిర్మాతలే కాదు. ఇది నాలుగేండ్ల కృషి.
ఇలా ఆన్లైన్ పైరసీ చేస్తున్నప్పుడు సినిమా విజయంపై ఆధారపడి జీవిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల గురించి ఆలోచించండి. ఇలా చేయడం వలన చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు కూడా ముప్పు ఉంటుంది. ఈ చర్యలపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకునే టైం వచ్చిందంటూ ట్వీట్ చేశాడు.
Naga Chaitanya | మాటిచ్చిన తండేల్ రాజు.. చేపల పులుసు వండిన నాగచైతన్య