Kaalidhar Laapata | బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కాళిధర్ లపతా’. దైవిక్ భగేలా, జీషన్ అయూబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మధుమిత దర్శకత్వం వహించగా.. జీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలోకి రాబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో జూలై 4న స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఒక కాళిధర్ అనే వృద్ధుడి చుట్టూ తిరుగుతుంది. ఆస్తి కోసం తన కుటుంబం తనను వదిలించుకోవాలని అనకుంటుందని తెలుసుకున్న ఆ వృద్ధుడు ఇంటి నుండి ఎవరికి తెలియకుండా పారిపోతాడు. ఈ క్రమంలో, అతనికి ఎనిమిదేళ్ల అనాథ అయిన బల్లుతో ఊహించని పరిచయం అవుతుంది. అయితే బల్లు పరిచయం అయ్యాకా అతడి జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి. కాళిధర్ ఫ్యామిలీ అతడిని కనిపెడుతుందా.. అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More