కార్తికేయ 2, ది కశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal )రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. దత్తత ప్రారంభానికి సంబంధించిన ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అభిషేక్ అగర్వాల్ కుటుంబం గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ (Anupam Kher) అన్నారు.
అభిషేక్ అగర్వాల్ తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ 60వ పుట్టినరోజు సందర్భంగా తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. గొప్ప పనులు చేసిన వారికి ఎల్లప్పుడూ అందరి ఆశీస్సులుంటాయని అనుపమ్ ఖేర్ అన్నారు. తామంతా ఈ కార్యక్రమం కోసం అభిషేక్ అగర్వాల్ పక్కనుంటామని, తాము తిమ్మాపూర్ గ్రామంలో మరోసారి సమావేశమవుతామని చెప్పారు. అనుపమ్ ఖేర్ విద్యార్థులకు ఆశీస్సులు అందిస్తూ.. కష్టపడేవాడు ఎప్పటికీ ఓడిపోడని, విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
కిర్రాక్ పార్టీ, గూఢచారి, కశ్మీర్ ఫైల్స్, గూఢచారి 2లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించింది అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్. ఈ లీడింగ్ బ్యానర్ ప్రస్తుతం రవితేజతో ధమాకా సినిమాతోపాటు పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర్ రావు కూడా తెరకెక్కిస్తోంది.
Read Also : Puri Jagannadh | అందరం కలిసేది స్మశానంలోనే.. మధ్యలో జరిగేదంతా డ్రామా.. పూరీ జగన్నాథ్
Read Also : Kamal Haasan | ప్రేక్షకులపై గొప్ప బాధ్యత ఉంది.. ఏదైనా వారే నిర్ణయిస్తారు.. కమల్ హాసన్
Read Also : Nani | సంతోష్ శోభన్‌లో నన్ను నేను చూసుకున్నా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని
Read Also : Varun Tej | పిక్ టాక్.. వర్షంలో వరుణ్ తేజ్, నాగబాబు ఇంతకీ ఎక్కడికెళ్లారు.. ?