సోమవారం 01 జూన్ 2020
Cinema - Apr 25, 2020 , 10:06:11

న‌టుడి అపార్ట్‌మెంట్‌లో క‌రోనా క‌ల‌కలం.. బిల్డింగ్ సీజ్

న‌టుడి అపార్ట్‌మెంట్‌లో క‌రోనా క‌ల‌కలం.. బిల్డింగ్ సీజ్

క‌రోనాకి సామాన్యుడి నుండి సెల‌బ్రిటీ వ‌ర‌కు గ‌జ‌గ‌జ వ‌ణికి పోతున్నారు. తాజాగా ఖాకీ ఫేం అభిమ‌న్యు సొసైటీ భ‌వ‌నం ఒబెరాయ్ స్ప్రింగ్స్‌లో మ‌హిళకి క‌రోనా వ‌చ్చింద‌ని తెలియ‌డంతో బిల్డింగ్ మొత్తాన్ని సీజ్ చేశారు. ఈ బిల్డింగ్‌లోనే  అభిమన్యుతో పాటు, విక్కీ కౌషల్ మరియు నీల్ నితిన్ ముఖేష్ వంటి అనేక మంది నటులు నివసిస్తున్నారు.

మ‌హిళ‌కి కోవిడ్ 19 రావ‌డంతో దీనిపై స్పందించిన అభిమ‌న్యు సింగ్‌.. ఆ అమ్మాయి క‌రోనా పాజిటివ్‌గా రావ‌డం చాలా దుర‌దృష్ట‌క‌రం. త్వ‌ర‌లోనే ఆమె కోలుకుంటుంద‌ని నేను న‌మ్ముతున్నాను. ఆమెకి ఆమె కుటుంబ స‌భ్యులకి మ‌రింత ధైర్యాన్ని ఇవ్వాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాని అని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం ఇంటికే ప‌రిమిత‌మైన అభిమ‌న్యు ఎక్క‌వగా పుస్త‌కాల‌తోనే కాల‌క్షేపం చేస్తున్నాడ‌ట‌. 


logo