Cinema News | నార్నే నితిన్, నయన్ సారిక జంటగా రూపొందుతోన్న గోదావరి నేపథ్య ప్రేమకథ ‘ఆయ్’. అంజి కె.మణిపుత్ర దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయని, పాటల స్పందన కూడా బావుందని, సోషల్‌మీడియాలో ఈ సినిమా రీల్స్, షార్ట్స్ బాగా వైరల్ అవుతున్నాయని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు.
ఈ అంచనాలను మరింత పెంచేలా ఈ నెల 5న పిఠాపురంలో ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ రొమాంటిక్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కెమెరా: సమీర్ కల్యాణి, సంగీతం: రామ్ మిర్యాల.