ప్రస్తుతం అమీర్‌ఖాన్ తన తాజా ప్రాజెక్ట్ ‘సితారే జమీన్ పర్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్.. తన కెరీర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం నా ఫోకస్ అంతా ‘సితారే జమీన్ పర్’పైనే. ఈ సినిమా విడుదలయ్యాక నా కలల ప్రాజెక్ట్ ‘మహాభారతం’పై దృష్టి సారిస్తా. అత్యంత భారీగా ఈ చిత్రాన్ని నిర్మించాలనేది నా కోరిక.
ఎన్నో ఏళ్ల నుంచి ఈ కథతో ప్రయాణిస్తున్నా. వెండితెర వేదికపై అద్భుతంగా దీన్ని ప్రేక్షకులకు చూపించాలని కలలు కంటున్నా. ప్రపంచంలో మనం చూసే ప్రతి విషయంలో మహాభారతం ఉంటుంది. ఎన్నో కోణాల, భావోద్వేగాల సమ్మేళనం మహాభారతం.
నేటితరానికి, భావి తరాలకు దీని గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిలో ఉంది. అయితే.. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో నేను నటుడిగా చేయడానికి ఏమీ ఉండదన్నది నా భావన. కానీ నాకైతే నటుడిగానే చనిపోవాలనుంది’ అంటూ చెప్పకొచ్చారు అమీర్‌ఖాన్.