Aakasam Lo Oka Tara | మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం మాలీవుడ్‌లో కంటే టాలీవుడ్లోనే దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘మహానటి’, ‘సీతారామం’ ‘కల్కి’ వంటి సూపర్ హిట్లు అందుకున్న ఈ నటుడు లక్కీ భాస్కర్ అంటూ రాబోతున్నాడు. అయితే నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. తెలుగు యువ దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సోంత బ్యానర్ అయిన స్వప్న సినిమాస్ ఈ సినిమా రుపోదిస్తుండగా.. దుల్కర్ బర్త్ డే సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఈ సినిమాకు ఆకాశంలో ఒక తార అనే టైటిల్ పెట్టినట్లు ప్రకటించారు. లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాను స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్, లైట్ బాక్స్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఆకాశంలో ఒక తార 💙
Wishing a blockbuster birthday to our STAR @Dulquer who will enchant us all with a story that makes your heart SOAR ❤️🔥#AakasamLoOkaTara@pavansadineni @Lightboxoffl @GeethaArts @SwapnaCinema @sunnygunnam @Ramya_Gunnam @SwapnaDuttCh @sujithsarang pic.twitter.com/MIJpZjDsrI
— Swapna Cinema (@SwapnaCinema) July 28, 2024
Also read..