పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు ఆదిపురుష్ (Aadipurush) మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని తానాజీ ఫేం ఓం రౌత్ (Om Raut) డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్ కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఆదిపురుష్ స్పెషల్ టీజర్ (3డీ వెర్షన్) స్క్రీనింగ్ ఈవెంట్‌ను హైదరాబాద్ లో నిర్వహించేందుకు సన్నాహాలుచేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ప్రభాస్‌తోపాటు చిత్రయూనిట్, మేకర్స్ టీం ఈవెంట్‌కు హాజరుకానుందట. 3డీ ఫార్మాట్లో రాబోతున్న ఆదిపురుష్ కొత్త టీజర్ అప్డేట్తో అభిమానులు ఎక్జయిటింగ్ కు గురవుతున్నారు.
ఆదిపురుష్‌లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా..బాలీవుడ్ భామ కృతిసనన్ సీతగా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ రావణాసుడిగా కనిపించబోతున్నాడు. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో, హనుమంతుడిగా దేవ్‌దత్తా నగే నటిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాచెట్-పరంపర మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.
Read Also : Ahimsa Teaser | తేజ టీం క్రేజీ అప్డేట్..లవ్ ట్రాక్, యాక్షన్ పార్టుతో అహింస టీజర్
Read Also :Salman Khan | మై డియర్ చిరు..సల్మాన్ ఖాన్ వీడియో వైరల్
Read Also : Satyadev | గాడ్ ఫాదర్‌తో సత్యదేవ్..ఎమోషనల్ పోస్ట్ వైరల్