SHAMBHALA | హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కొత్తదనంతో కూడిన సినిమాలు చేయడంలో ముందుండే యాక్టర్లలో ఒకరు టాలీవుడ్ యాక్టర్ ఆదిసాయికుమార్ (Aadi Saikumar). ఈ క్రేజీ యాక్టర్ నటిస్తోన్న చిత్రం శంబాల (SHAMBHALA). ఈ చిత్రానికిఏ యాడ్ ఇన్ఫినిటీ ఫేం యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే ఆది సాయికుమార్ శంబాల ఫస్ట్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మంటల మధ్యలో నుంచి సైకిల్‌పై వస్తున్న ఆది లుక్ సోషల్ మీడియాలో క్యూరియాసిటీ పెంచుతూ.. సినిమాపై హైప్ పెంచేస్తుంది. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు.
మిస్టికల్ వరల్డ్ లోకి క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న తీసుకెళ్లబోతున్నాం. సూపర్ న్యాచురల్ థ్రిల్స్, ఇలాంటి ప్రపంచాన్ని నిర్మించడం తొలిసారి… స్టన్నింగ్ విజువల్స్, ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్, వీఎఫ్ఎక్స్ పార్ట్‌తో భారీగా స్థాయిలో రాబోతున్నాం.. అంటూ ట్వీట్ చేశారు మేకర్స్.
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లో పొలంలో వింత ఆకారంలో ఉన్న దిష్టిబొమ్మ.. మరోవైపు ఆకాశం నుంచి భూమివైపు వస్తున్న నిప్పు కణం చూడొచ్చు. అనుమానాస్పద ప్రపంచం.. అంటూ ఆది సాయికుమార్ సరికొత్త పాయింట్‌తో శంబాల చేస్తున్నట్టు హింట్ ఇచ్చేస్తుంది.
ఈ మూవీలో అర్చనా అయ్యర్ హీరోయిన్గా నటిస్తుండగా.. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్, అన్నభీమోజు, మహిధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ రాబోతున్న ఈ మూవీలో ఆది జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీకి శ్రీమ్ మద్దూరి సంగీతం అందిస్తున్నారు.
This is gonna be BIG 💥
Gear up to witness supernatural thrills, first-of-its-kind world-building, stunning visuals, intense storytelling & top-notch VFX#Shambhala: A Mystical World Releasing This #Christmas On Dec 25th@iamaadisaikumar #Swasika @tweets_archana@ugandharmuni… pic.twitter.com/AqGpiVdgl9
— BA Raju’s Team (@baraju_SuperHit) October 18, 2025