Aadi Saikumar | ఆది ‘క్రేజీఫెల్లో’ రిలీజ్ డేట్ ఫిక్స్.. విడుదల ఎప్పుడంటే?
Crazy Fellow Release date | హిట్లు, ఫ్లాపులలో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు ఆది సాయికుమార్. ‘ప్రేమకావాలి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది అనతికాలంలోనే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన క్రేజ్ ఎలా ఉన్నా సినిమాలను మాత్రం వరుస పెట్టి ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన ఆరు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ‘క్రేజీ ఫెల్లో’ ఒకటి. సిరికి ఫణికృష్ణ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఆదికి మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాడు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఆదికి జోడీగా దిగంగన సూర్యవంశీ, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫి:సతీష్ ముత్యాల, ఎడిటింగ్:సత్య గిడుటూరి.
Our new-age youthful entertainer #CrazyFellow coming to theatres from September 16th, 2022!
Get ready for a crazy ride♥️
@AadiSaikumar @DiganganaS @mirnaaofficial @siriki_phani @SriSathyaSaiArt @KKRadhamohan #RRDhruvan #SatishMutyala @GiduturiSatya @adityamusic @UrsVamsiShekar pic.twitter.com/VXAgVRSbzA
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) July 8, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

