‘కొడుకు పైకి రావడంలో తండ్రికి ఉండే ఆనందం నాకంటే ఎవరికీ తెలియదు. సాయికుమార్‌తో మాది మూడు తరాల అనుబంధం. తను మా కుటుంబ సభ్యుడే. ఈ రోజు అతని కుమారుడు విజయం సాధించాడు. అది మాకూ ఆనందదాయకమే. అందుకే ఈ వేడుకకు వచ్చాను.’ అన్నారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. ఆది సాయికుమార్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకుడు. రాజశేఖర్ అన్నభిమోజు,, మహీధర్‌రెడ్డి నిర్మాతలు. ఈ నెల 25న సినిమా విడుదలైంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కి అతిథిగా విచ్చేసిన అల్లు అరవింద్ పై విధంగా స్పందిచారు. ఇంకా చెబుతూ “శంబాల’ సినిమాను దర్శకుడు యుగంధర్ ముని అద్భుతంగా తెరకెక్కించారు. కథనూ, దర్శకుడ్ని నమ్మి ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు కంగ్రాట్స్ చెబుతున్నా. ఇకనుంచి ఆది హైవే ఎక్కినట్టు దూసుకుపోవాలి’ అని అల్లు అరవింద్ ఆకాంక్షించారు. ఈ విజయం పనిచేసిన అందరిదీ అనీ, ‘శంబాల’ సినిమాను థియేటర్లోనే చూడాలని ఆది సాయికుమార్ చెప్పారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.