Soul Trip | తెలుగులో టాక్ షోల సందడి కొత్తేమీ కాదు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ యాక్టర్లు చేసిన టాక్ షోలు మంచి స్పందన రాబట్టుకున్నాయి. ఇప్పుడు మరో కొత్త టాక్ షో రాబోతుంది. ఇది కొంచెం స్పెషల్ అన్నమాట. ఎందుకంటే తొలిసారి టాలీవుడ్ స్టార్స్‌తో ట్రావెల్ బేస్డ్ టాక్ షో రానుంది. ‘సోల్ ట్రిప్’(Soul Trip) టైటిల్‌తో రాబోతున్నఈ టాక్ షోకు హీరో విజయ్ దాట్ల హోస్ట్‌గా వ్యహరిస్తున్నాడు.
పోస్టర్, అన్వేషి సినిమాల్లో నటించిన విజయ్ దాట్ల హోం బ్యానర్ గండభేరుండ ఆర్ట్స్‌పై ఈ సెలబ్రిటీ టాక్ షోను నిర్మిస్తుండటం విశేషం. టాక్ షో సీజన్ 1ను ముగించుకుని.. పాపులర్ ఓటీటీ ఛానల్లో త్వరలోనే విడుదల చేయబోతున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా సోల్ ట్రిప్టాక్ పోస్టర్‌ను విడుదల చేశారు. జగపతిబాబు, శ్రీకాంత్, స్టార్ కమెడియన్ అలీ, హీరోయిన్స్ శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వర్మ బొల్లమ్మ సీజన్ 1లో సందడి చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చేశారు మేకర్స్.
టాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత ప్రయాణం, అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్, నిజమైన సంభాషణల లాంటి అంశాలపై ఈ షో ఫోకస్ పెట్టబోతున్నట్టు మేకర్స్ చెబుతున్నారు.
Tollywood stars set out on an adventurous journey! 🌍#SoulTrip — a travel-based celebrity talk show hosted by hero-producer #VijayDatla — is gearing up for its OTT release. Season 1 features #JagapathiBabu, #Srikanth, Ali, #SivaniRajasekhar, #ShivatmikaRajasekhar & more! pic.twitter.com/lweBHoJu3Y
— Suresh PRO (@SureshPRO_) January 26, 2026