Peddi Movie | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్లో భాగంగా భారీ పోరాట సన్నివేశాలతో పాటు, చిత్రంలోని ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఇదిలావుంటే, తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి ఒక ఫోటో బయటకు వచ్చింది. ‘పెద్ది’ చిత్రయూనిట్‌లోని ఒక సభ్యుడి పుట్టినరోజు సందర్భంగా టీమ్ సభ్యులు అతడి బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. రామ్ చరణ్‌తో పాటు జాన్వీ కపూర్ దగ్గరుండి అతడితో కేక్ కట్ చేయించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ, కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్షన్, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు భట్టాచార్య వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Read More