GlobeTrotter | తెలుగుతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఫోకస్ అంతా ఇప్పుడు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌పైనే ఉంది. ఇప్పటికే బాహుబలి ప్రాంచైజీ, ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజౌమౌళి. ఈ ప్రాజెక్టులతో వరల్డ్‌వైడ్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకున్నాడు జక్కన్న . ఈ సారి మహేశ్‌బాబుతో ఏకంగా హాలీవుడ్‌ను తలదన్నే సినిమా చేస్తూ టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. ఎస్ఎస్ఎంబీ 29 సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పే షాకింగ్ వార్త ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇవాళ రామోజీఫిలింసిటీలో జరుగబోతున్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌కు ఖండాంతరాలను దాటి వచ్చాడు ఓ వీరాభిమాని. ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు చెందిన సునీల్ ఆవుల ఏకంగా వేల కిలోమీటర్లు దాటి మరి హైదరాబాద్ ఈవెంట్‌కు వచ్చాడంటే.. సినిమాపై క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సునీల్ ఆవుల 12 గంటల విమానప్రయాణం ద్వారా పెర్త్ వీధుల నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి సుమారు 6817 కిలోమీటర్లు దాటి రామోజీఫిలింసిటీకి రావడం గమనార్హం. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ #JaiBabu #GlobeTrotter హ్యాష్ ట్యాగ్‌లను జోడించాడు సునీల్ ఆవుల.
ఇక సునీల్ ఆవుల డెడికేషన్ చూసి నెటిజన్లు షాక్‌కు లోనవుతున్నారు. ఇక సదరు అభిమాని డెడికేషన్‌కు తనదైన స్టైల్లో ట్వీట్ చేశాడు రాజమౌళి కుమారుడు కార్తికేయ. ఒక్క తెలుగోడు మాత్రమే ఫీల్ అయ్యే అతిపెద్ద ఎమోషన్.. ఆకాశం కూడా హద్దు కాదు.. అంటూ కామెంట్ చేశాడు కార్తికేయ. హైదరాబాద్‌లో జరిగే తెలుగు సినిమా ఈవెంట్ కోసం ఓ అభిమాని ఇలా ఖండాంతరాలు దాటి రావడం మొట్టమొదటి సారి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
After 12hr of flight and 6817 kms from streets of Perth to RFC Hyderabad. #JaiBabu @urstrulyMahesh #GlobeTrotter day. pic.twitter.com/eWZzlwg5gB
— Sunil Avula (@avulasunil) November 15, 2025
Dining With The Kapoors | కపూర్ ఫ్యామిలీపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ట్రైలర్ చూశారా.!
Bala Krishna | అఖండ 2 టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో బాలయ్య సందడి .. హిందీ స్పీచ్ , తమన్‌తో సరదా
Dining With The Kapoors | కపూర్ ఫ్యామిలీపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ట్రైలర్ చూశారా.!