8 Vasantalu | టాలీవుడ్ యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘8 వసంతాలు’(8 Vasantalu). దాదాపు 7 సంవత్సరాల తర్వాత మెగాఫోన్ పట్టిన ఈ దర్శకుడు ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘8 వసంతాలు’(8 Vasantalu). సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తుండగా.. ఈ సినిమాలో మ్యాడ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనిల్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా మరో అప్డేట్ను పంచుకుంది.
ఈ సినిమా నుంచి 2వ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. జూన్ 7న మధ్యాహ్నం 3:33 గంటలకు ఈ మూవీ నుంచి రెండవ టీజర్‌ను పంచుకోబోతున్నట్లు మైత్రీ ప్రకటించింది. ఇక ఈ సినిమాను జూన్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ చిత్రంలో అనంతిక సనీల్ కుమార్ శుద్ధి అయోధ్య అనే మార్షల్ ఆర్ట్స్ యోధురాలిగా కనిపించబోతుంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 365 రోజులని అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం… అదే అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం. 8 వసంతాలు అంటే ‘8 స్ప్రింగ్స్’ ఇది 8 సంవత్సరాల కాలంలో కాలక్రమానుసారంగా సాగే కథనం, ఒక అందమైన యువతి జీవితంలోని ఒడిదుడుకులు, ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఎక్స్ ఫ్లోర్ చేయనుంది.
A gentle breeze of love will touch you tomorrow ❤️#8VasantaluTeaser2 out tomorrow at 3.33 PM ❤🔥#8Vasantalu grand release worldwide on June 20th.
Directed by #PhanindraNarsetti
Produced by @MythriOfficialStarring @Ananthika108 @ActorRaviTheja #HanuReddy @KannaPasunoori… pic.twitter.com/1NUbkI3btF
— Mythri Movie Makers (@MythriOfficial) June 6, 2025
Read More