హైదరాబాద్ : కేసీఆర్ హయాంలో ఎంతో ముందుచూపుతో ప్రారంభించిన కోడింగ్ పాఠశాలలో చదివిన అనూష, ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 582 మార్కులతో టాపర్‌గా నిలిచిందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే ఆమెకు పైథాన్, సి లాంగ్వేజ్ వంటి కంప్యూటర్ లాంగ్వేజెస్ తెలుసు, కోడింగ్ ప్రోగ్రామింగ్ రాయడం కూడా తెలుసు. ఇవి చాలా మంది ఇంజనీర్లకు కూడా తెల్వవు. ఇపుడు ఈ బిడ్డ దేశంలోనే అత్యున్నత గౌలిదొడ్డి ప్రతిభా పాఠశాలలో అడ్మిషన్ పొందింది అని ఆర్ఎస్పీ తెలిపారు.
రాబోయే రోజుల్లో ప్రతిష్టాత్మక ఐఐటిలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్స్ చేసి, వీలయితే ఐఏఎస్‌గా ఉద్యోగం సంపాదించి దేశానికి సేవ చేయాలనేది ప్రస్తుతానికి ఆమె లక్ష్యం. వారిది చాలా నిరుపేద కుటుంబం, ఆమె తమ్ముడు రాహుల్ కూడా గురుకుల పాఠశాలలోనే చదువుతూ అండర్ 17 లో క్రికెట్ నేషనల్స్ ఆడాడు. ఇక తండ్రికి పుట్టుకతోనే మాటలు రావు! కమీషన్ కాంగ్రెస్ నాయకులకు ఇవన్నీ తెలుసా? ఊరికే రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప. ఈమె ఒక్కరే కాదు, ఇంకా వందల సంఖ్యలో ఇలాంటి పిల్లలు ఉన్నరు. మీకు చేతనైతే ఇలాంటి పిల్లలను తయారుచేయండి. అంతే కానీ టాయిలెట్స్ కడిగించాలి,చెత్త ఊడ్పించాలి అనే చిల్లర ఆలోచనలు, విషప్రచారాలు మానుకోండి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
KCR గారి హయాంలో ఎంతో ముందుచూపుతో ప్రారంభించిన కోడింగ్ పాఠశాలలో చదివిన అనూష, ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 582 మార్కులతో టాపర్ గా నిలిచింది.
ఇప్పటికే ఆమెకు పైథాన్, సి లాంగ్వేజ్ వంటి కంప్యూటర్ లాంగ్వేజెస్ తెలుసు,కోడింగ్ ప్రోగ్రామింగ్ రాయడం కూడా తెలుసు. ఇవి చాలా మంది… pic.twitter.com/CVC4yi1SMz
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) June 6, 2025