Lokesh Kanagaraj | విక్రమ్, లియో, కూలీ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఇప్పటిదాకా డైరెక్టర్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన లోకేశ్ కనగరాజ్ ఇక మేకప్ వేసుకుని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలిసిందే. తాజా టాక్ ప్రకారం లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ లోకేశ్ కనగరాజ్ డెబ్యూ సినిమాను తెరకెక్కించనుంది.
DC వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ తీసుకోబోయే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి ఏకంగా రూ.35 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే సౌతిండియాలో ఇప్పటివరకు డెబ్యూ సినిమాకు ఇంత రెమ్యునరేషన్ తీసుకున్న వన్ అండ్ ఓన్లీ సెలబ్రిటీ లోకేశ్ కనగరాజ్ కానున్నాడు.
స్టైలిష్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో బలమైన భావోద్వేగపూరిత అంశాలతో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఇక స్టార్ హీరోలతో సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసిన లోకేశ్ కనగరాజ్ హీరోగా ఎలా మెప్పించబోతున్నాడన్నది ఉత్కంఠ రేకిత్తిస్తోంది.
ధనుష్‌తో కెప్టెన్ మిల్లర్, కీర్తిసురేశ్‌తో సాని కాయిధమ్ సినిమాలను డైరెక్ట్ చేసిన అరుణ్ మథేశ్వరన్ ఈ స్టార్ డైరెక్టర్ డెబ్యూ సినిమాను హ్యాండిల్ చేయబోతున్నాడని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు కూలీలో మెరిసిన కన్నడ భామ రచితారామ్ను ఈ చిత్రంలో హీరోయిన్గా తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ క్రేజీ వార్తలపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Ram Gopal Varma | చాలా కాలం తర్వాత నిజమైన రాంచరణ్‌ను చూశా.. చికిరి చికిరి సాంగ్‌పై రాంగోపాల్ వర్మ