35 Chinna Katha Kaadu | ప్రియదర్శి (Priyadarshi), నివేదా థామస్ ( Nivetha Thomas), విశ్వదేవ్ ఆర్ (Viswadev R), ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu). ఈ సినిమాకు నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహిస్తుండగా.. రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళంలో సెప్టెంబర్ 06న వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. తిరుపతి నేపథ్యంలో జరిగే ఈ కథలో నివేదా తల్లి పాత్రలో నటిస్తుంది. పరీక్షల్లో కనీసం పాస్ మార్కులు రానందుకు తండ్రి మందలించగా.. కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోతే.. అతడి తల్లి పడే ఆవేదన ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా స్టోరీ. ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్‌సాగర్.
#35Movie – 06th September Release pic.twitter.com/PA0YSVhjWn
— Aakashavaani (@TheAakashavaani) August 25, 2024
Also Read..