మల్లేశం, 8ఏమ్ మెట్రో వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు దర్శకుడు రాజ్ ఆర్. ఆయన రూపొందించిన తాజా చిత్రం ‘23’. తేజ, తన్మయి ప్రధాన పాత్రల్ని పోషించారు. స్టూడియో 99 సంస్థ నిర్మించిన ఈ చిత్రం.. స్పిరిట్ మీడియా ద్వారా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకురానుంది.
మానవ హక్కుల నేపథ్యంలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని మేకర్స్ తెలిపారు. ఝాన్సీ, పావోన్ రమేష్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె రాబిన్, దర్శకత్వం: రాజ్ ఆర్.