‘18 పేజెస్’ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ ఏడాది విడుదలైన టాప్‌ఫైవ్ లవ్‌స్టోరీస్‌లో మా చిత్రం కూడా తప్పకుండా ఉంటుంది’ అన్నారు కథానాయకుడు నిఖిల్. ఆయన హీరోగా నటించిన ‘18పేజెస్’ సినిమా ఇటీవల విడుదలైంది. సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు.
తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్, నిర్మాత బన్నీవాస్, దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్, కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తదితరులు పాల్గొన్ని చిత్ర విజయం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.