Trisha | హీరోయిన్గా కెరీర్ ప్రారంభించి దాదాపు 20 వసంతాలు పూర్తి అయిన ఇప్పటికి వన్నె తరగని క్రేజీ నాయికగా కొనసాగుతున్నారు త్రిష (Trisha). తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా వున్నారు ఈ చెన్నయ్ సుందరి. అంతేకాదు ఒకవైపు కుర్రహీరోలతో నటిస్తూనే.. మరో వైపు సీనియర్ కథనాయకుల సరసన ఆడి పాడుతున్నారు. వీటితో పాటు ఆమె ఓటీటీ వెబ్‌సీరిస్‌లతో కూడా బిజీగా వున్నారు. ప్రస్తుతం సీనియర్ కథానాయకుడు చిరంజీవితో దాదాపు 18 ఏళ్ల తరువాత విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె పాత్ర కూడా కేవలం హీరోయిన్‌గానే కాకుండా సినిమాలో చాలా కీలకంగా వుంటుందట.
అయితే ఇలాగే మరో హీరోతో కూడా త్రిష దాదాపు 16 ఏళ్ల తరువాత జత కడుతున్నారు. ఆ హీరో ఎవరో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కల్కి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత ఈ రెబల్ స్టార్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు హారర్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తరువాత ప్రభాస్ నటించనున్న మరో చిత్రం స్పిరిట్.
సంచలన దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంలో కథానాయికగా త్రిషను ఎంపిక చేశారని అంటున్నారు. దాదాపు 16 ఏళ్ల తరువాత త్రిష, ప్రభాస్ కలిసి నటించబోతున్నారు. ఇంతకు ముందు ఈ ఇద్దరు కలిసి వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై చిత్రాల్లో నటించారు. ఇందులో వర్షం, బుజ్జిగాడు చిత్రాలు రెండు సూపర్‌హిట్ సినిమాలే. పౌర్ణమి మాత్రం యావరేజీగా నిలిచింది. అయితే ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం వుంది. సో.. ఈ హిట్ జోడి మళ్లీ కలవడానికి 16 ఏళ్లు పట్టింది.
Mr Bachchan | రొమాంటిక్ లుక్‌తో రవితేజ మిస్టర్ బచ్చన్ ట్రైలర్ టైం చెప్పిన మేకర్స్
Kangana Ranaut | ఖరీదైన విల్లాను అమ్మకానికి పెట్టిన కంగనారనౌత్..?
Sardar 2 | ఆ వార్తలే నిజమయ్యాయి.. కార్తీ సర్దార్ 2లో హీరోయిన్ ఫైనల్..!