Youtuber Praneeth Hanumantu | తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. చిన్న పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసిన తెలుగు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ అయిన అనంతరం తెలంగాణ పోలీసులు అతడిని బెంగళూరు స్థానిక కోర్టులో హాజరుపరిచి.. కోర్టు అనుమతితో ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని నేడు హైదరాబాద్ కు తీసుకువచ్చారు.
ఇక ప్రణీత్‌పై 67బీ ఐటీ, పోక్సో, 294 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. ఈ కేసుపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు ప్రణీత్‌కు14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించి చంచల్ గూడ జైలుకు తరలించారు.. ఇక ఈ ఘటనలో ప్రణీత్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఏ1గా ప్రణీత్, ఏ2గా నాగేశ్వరరావు, ఏ3గా యువరాజు, ఏ4గా సాయి ఆదినారాయణపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసుపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు ప్రణీత్‌కు14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఇక ఈ ఘటనలో ప్రణీత్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఏ1గా ప్రణీత్, ఏ2గా నాగేశ్వరరావు, ఏ3గా యువరాజు, ఏ4గా సాయి ఆదినారాయణపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read..
Youtuber Hanumantu | సినీ ఫక్కిలో అరెస్ట్ అయిన యూట్యూబర్ హనుమంతు.. నేడు హైదరాబాద్‌కు తరలింపు