విధు వినోద్చోప్రా దర్శకత్వంలో రూపొందిన ‘12th ఫెయిల్’ చిత్రానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. పేదరికాన్ని జయించి ఐపీఎస్ సాధించిన మనోజ్కమార్ శర్మ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విక్రాంత్ మస్సే, మేధా శంకర్ ప్రధాన పాత్రల్ని పోషించారు. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ చిత్రాన్ని వీక్షించి అభినందించారు.
తాజాగా ఈ సినిమాకు ప్రీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు విధు వినోద్చోప్రా తెలిపారు. ‘జీరో సే రీస్టార్ట్’ పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నామని, ‘12th ఫెయిల్’లోని తారాగణమంతా భాగమవుతున్నారని ఆయన వెల్లడించారు.
అబుదాబిలో జరుగుతున్న ‘ఐఫా’ చిత్రోత్సవంలో పాల్గొన్న ఆయన ప్రీక్వెల్ తాలూకు విశేషాలను వెల్లడించారు. మనోజ్‌కుమార్ శర్మ బాల్యం మొదలుకొని అతని కాలేజీ రోజుల వరకు సాగే జీవిత ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నామని పేర్కొన్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించి రెండు నెలల్లో చిత్రాన్ని పూర్తి చేస్తామని, డిసెంబర్ 13న విడుదల చేస్తామని విధు వినోద్చోప్రా తెలిపారు.