కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay)-లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబోలో వస్తున్న చిత్రం లియో (Leo.. Bloody Sweet). దళపతి 67వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపిస్తూ.. ఇప్పటికే విడుదలైన లియో టైటిల్ ప్రోమో నెట్టింటిని షేక్ చేస్తోంది. లియో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సెట్స్‌పై ఉండగానే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది లియో.
ఇప్పటికే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయని సెవెన్ స్క్రీన్ స్టూడియో వెల్లడించింది. , డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా.. శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీ సర్కిల్‌ను షేక్ చేస్తోంది. అదేంటంటే ఈ సినిమా థ్రియాట్రికల్, డిజిటల్, ఆడియో, శాటిలైట్ రైట్స్ తో కలిపి రూ.400 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
లియో థ్రియాట్రికల్ రైట్స్ ఊహించని మొత్తానికి అమ్ముడుపోయినట్టు ట్రేడ్ సర్కిల్లో జోరుగా టాక్ నడుస్తోంది. ఒకవేళ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. లియో చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
లియోలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్ తోపాటు ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. లియోకు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్తోపాటు రత్నకుమార్, ధీరజ్ వైడీ డైలాగ్స్ అందిస్తున్నారు.
Read Also :
VD12 | క్రేజీ టాక్.. హిట్ మ్యూజిక్ డైరెక్టర్‌కే VD12లో మరో ఛాన్స్..?
SSMB 28 | మహేశ్‌బాబుతో వన్స్‌మోర్.. ఎస్ఎస్ఎంబీ 28లో టాలెంటెడ్ యాక్టర్..!
Mahesh babu | సూపర్ యంగ్ లుక్‌లో మహేశ్ బాబు.. యాడ్ వీడియో వైరల్
Anikha Surendran | ఈ సారి కొంచెం హాట్‌గా.. అనిఖా సురేంద్రన్ ప్రమోషన్స్ స్టిల్స్ వైరల్