హైదరాబాద్, ఆగస్టు 11 : అంతర్జాతీయ మేనేజ్మెంట్ కన్సల్టింగ్, టెక్నాలజీ సంస్థయైన జెడ్ఎస్.. భారత్‌లో వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని తెరిచింది. 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో 550-600 మంది వరకు కూర్చోవడానికి వీలుంటుంది.
హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్ విభాగాల్లో ఇన్నోవేషన్, సర్వీసులను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ సెంటర్‌ను నెలకొల్పినట్టు ఇన్నోవేషన్ కంపెనీ రీజినల్ మేనేజింగ్ ప్రిన్సిపల్ మోహిత్ సూద్ తెలిపారు.