Zomato – Swiggy | ఇప్పుడు ఇష్టమైన భోజనం, వంటకం.. స్వీట్స్ క్షణాల్లో మన ముందు ఉంటుంది. అందుకు స్మార్ట్ ఫోన్లలో యాప్స్.. బ్యాంకు అకౌంట్లలో అందుకు సరిపడా డబ్బు ఉంటే చాలు. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్‌లో బుక్ చేస్తే క్షణాల్లో డెలివరీ అయిపోతుంది. ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో దేశంలోని ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ కొన్ని సెలెక్టెడ్ నగరాల పరిధిలో ప్లాట్ ఫామ్ ఫీజు పెంచేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో అటు స్విగ్గీ, ఇటు జొమాటో సంస్థలు ఈ ప్లాట్ ఫామ్ పెంచాయి.
ఫెస్టివ్ రష్ను దృష్టిలో పెట్టుకునే బుధవారం నుంచే ప్లాట్‌ఫామ్ ఫీజు ఢిల్లీతోపాటు కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో పెంచుతున్నట్లు జొమాటో తెలిపింది. దీనికి ‘ఫెస్టివ్ సీజన్’ ఫీజుగా నామ కరణం చేసింది. నగరానికి నగరానికి మధ్య ఈ ఫెస్టివ్ సీజన్ ఫీజులో తేడా ఉంటుందని క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది. అయితే నగరాల వారీగా ఎంత మొత్తం ఫీజు పెరుగుతుందో క్లారిటీ ఇవ్వలేదు. మరో ప్లాట్ ఫామ్ స్విగ్గీ సైతం ప్లాట్ ఫామ్ ఫీజు పెంచుతున్నట్లు ప్రకటించింది. కానీ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు.