Zomato | ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ అండ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో కో-ఫౌండర్ అండ్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఆకృతి చోప్రా రాజీనామా చేశారు. ఇతర ప్రయోజనాల కోసం తాను వైదొలుగుతున్నట్లు ఆకృతి చోప్రా తెలిపారని జోమాటో పేర్కొంది. సీనియర్ మేనేజ్మెంట్ పర్సనల్ హోదాలో ఆమె రాజీనామా చేశారని, ఈ నెల 27 నుంచి ఆమె రాజీనామా అమల్లోకి వస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. జొమాటోలో 13 ఏండ్లుగా సంస్థ స్థాపనలోనూ, ఇంతకుముందు సంస్థ సీఎఫ్ఓగా లీగల్, ఫైనాన్సియల్ టీమ్స్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.
జొమాటోలో చేరక ముందు టాక్స్, రెగ్యులేటరీ నిబంధనల అమలు తీరు తెలుసుకునేందుకు ఆకృతి చోప్రా మూడేండ్ల పాటు పీడబ్ల్యూసీలో పని చేశారు. గతేడాది జనవరిలో మరో జొమాటో కో-ఫౌండర్, అప్పటి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గుంజన్ పాటిదార్ సంస్థతో దశాబ్ధ అనుబంధం తర్వాత రాజీనామా చేశారు. 2022 నవంబర్ లో మరొక కో-ఫౌండర్ మోహిత్ గుప్తా రాజీనామా చేశారు. 2020లో మోహిన్ గుప్తా.. ఫుడ్ డెలివరీ బిజినెస్ సీఈఓ హోదా నుంచి జొమాటో కో-ఫౌండర్ స్థాయికి ప్రమోట్ అయ్యారు.