న్యూఢిల్లీ : ఏఐ టూల్స్ రాకతో పలు కంపెనీలు మెరుగైన సేవలు అందించేందుకు ఇంటరాక్టివ్ ఏఐ టూల్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఇక ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో (Zomato), బ్లింకిట్ సైతం తమ సర్వీసులను మెరుగుపరిచేందుకు ఏఐ టూల్స్ వాడనున్నాయి. పెద్దసంఖ్యలో ఇంజనీర్లు, డేటా సైంటిస్ట్లను రిక్రూట్ చేసేందుకు సన్నాహాలు చేపట్టాయి. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీని లాంఛ్ చేసిన అనంతరం ఏఐ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగమైంది.
అతిత్వరలోనే ఏఐ సోషల్ మీడియా తరహాలో ప్రజల జీవితాలతో మమేకం కానుంది. న్యూ టెక్నాలజీని వాడుతూ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించే దిశగా ఏఐ టూల్స్‌ను ప్రవేశపెట్టేందుకు జొమాటో, బ్లింకిట్లు సన్నద్ధమయ్యాయి. మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్‌లో పట్టున్న ఇంజనీర్స్‌ను నియమించుకునేందుకు కసరత్తు సాగిస్తున్నాయి. ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు జొమాటో ఇప్పటికే ఏఐ ప్రోడక్ట్ డెవలప్మెంట్ హెడ్‌ను నియమించింది.
సెర్చ్, నోటిఫికేషనక్స్ వంటి పలు కస్టమర్ సేవలతో పాటు ప్రోడక్ట్ ఫొటోగ్రఫీ, కస్టమర్ సపోర్ట్ వంటి బ్యాకెండ్ టూల్స్‌లో ఏఐ సేవలను వినియోగించేందుకు జొమాటో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కస్టమర్‌కు మెరుగైన ఎక్స్పీరియన్స్ అందించే క్రమంలో జొమాటో, బ్లింకిట్ ప్లాట్‌ఫాంపై త్వరలో ఏఐ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Read More