ChatGPT | చాట్‌జీపీటీతో ఊడిన కంటెంట్ రైటర్ జాబ్..ఏసీ టెక్నీషియన్‌గా శిక్షణ..!
ఏఐ టూల్స్‌తో కొలువుల కోత తప్పదనే ఆందోళన నెలకొన్న నేపధ్యంలో చాట్‌జీపీటీ రాకతో (ChatGPT) కంటెంట్ రైటర్లు, కాపీ రైటర్ల ఉద్యోగాలు ఊడటం మొదలైంది.
న్యూఢిల్లీ : ఏఐ టూల్స్‌తో కొలువుల కోత తప్పదనే ఆందోళన నెలకొన్న నేపధ్యంలో చాట్‌జీపీటీ రాకతో (ChatGPT) కంటెంట్ రైటర్లు, కాపీ రైటర్ల ఉద్యోగాలు ఊడటం మొదలైంది. చాట్‌జీపీటీ కారణంగా ఓ టెక్ స్టార్టప్‌లో కాపీ రైటర్‌గా పనిచేస్తున్న మహిళ తన ఉద్యోగాన్ని కోల్పోగా, తాజాగా ఎరిక్ ఫెన్ (34) అనే కంటెంట్ రైటర్ తన జాబ్‌ను చాట్‌జీపీటీ రీప్లేస్ చేసిందని వాపోయాడు. జాబ్ పోవడంతో ఇప్పుడు కుటుంబాన్ని పోషించడం అతడికి పెనుభారమైంది. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీతో తన ఉద్యోగం ఊడటంతో ఇప్పుడు ఏకంగా ఫీల్డ్‌ను మార్చాలని యోచిస్తున్నట్టు ఫెన్ పేర్కొన్నాడు.
తాను చాట్‌జీపీటీని వాడుతూ కంటెంట్ రాస్తున్నట్టు తెలుసుకున్న తన క్లయింట్లు ఏఐ సర్వీస్‌ను ఉపయోగించి తనను పక్కనపెట్టారని చెప్పుకొచ్చాడు. జనరేటివ్ ఏఐ సర్వీస్‌తో తమ పనులు చక్కబెట్టుకునే వెసులుబాటు ఉండగా అతడిపై ఎందుకు డబ్బు వెచ్చించాలని తన క్లయింట్లు భావిస్తున్నారని అన్నాడు. ఈ ఏడాది మార్చిలో తొలి క్లయింట్‌ను కోల్పోయిన అతడు ఆపై తొమ్మిదికి పైగా కాంట్రాక్టులు ఇదే కారణంతో రద్దయ్యాయని తెలిపారు.
ఇక చాట్‌జీపీటీ సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఓ క్లయింట్ తిరిగి అతడిని పనిలోకి తీసుకున్నాడు. అయితే అతడు సరైన పేమెంట్ ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నాయంగా వేరే పనులు చూసుకోవాలని ఎరిక్ ఫెన్ యోచిస్తున్నాడు. అరకొర జీతంతో కంటెంట్ రైటర్‌గా నెగ్గుకురాలేనని, ఏసీ టెక్నీషియన్ లేదా ప్లంబర్‌గా మారాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఇక చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌తో పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కనుమరుగవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read More
Tech Tips | మీ మొబైల్లో మాల్వేర్ ఉందని అనుమానమా? ఇలా చెక్ చేసుకోండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- ChatGPT
- content writer
- job
- replace
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

