Apps:
Follow us on:

Tech Tips | మీ మొబైల్‌లో మాల్‌వేర్‌ ఉందని అనుమానమా? ఇలా చెక్‌ చేసుకోండి..

1/9ఇటీవల సైబర్‌ దాడులు ఎక్కువైపోతున్నాయి. యాప్స్‌, వెబ్‌లింక్స్‌ ద్వారా ప్రమాదకరమైన మాల్‌వేర్స్‌ను ఫోన్లలోకి పంపిస్తున్నారు. ఆ తర్వాత మొబైల్‌లోని డేటాను మొత్తం కొట్టేస్తున్నారు. ఇలా చాలామంది మొబైల్స్‌ ఇప్పుడు హ్యాకర్స్‌ మన ఫోన్లను ఆధీనంలోకి తీసుకుంటున్నారు. మరి మీ మొబైల్‌ హ్యాకర్ల బారిన పడిందా? మీ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? లేదా అనే విషయాలను ఈ టిప్స్‌తో తెలుసుకోండి.
2/9స్మార్ట్‌ఫోన్ స్పైవేర్ దాడికి గురైతే యాడ్స్ ఎక్కువ‌గా డిస్‌ప్లే అవుతుంటాయి. అశ్లీల యాడ్స్ ఎక్కువ‌గా క‌నిపించినా.. డిస్‌ప్లే అయినా యాడ్స్‌ను క్లోజ్ చేసే స‌దుపాయం లేక‌పోయినా అనుమానించాల్సి ఉంటుంది. ఇలాంటి స్పైవేర్‌ను యాడ్‌వేర్ అని కూడా పిలుస్తారు.
3/9మీ మొబైల్‌లో మీకు తెలియ‌కుండానే ఏవైనా యాప్స్ ఇన్‌స్టాల్ అవుతున్నా, ఓపెన్ చేసిన యాప్స్ త‌ర‌చూ క్లోజ్ అవుతున్నా కూడా అనుమానించాల్సి ఉంటుంది. ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేసిన‌ప్పుడు స‌డెన్‌గా ఆ యాప్ ఐకాన్ మాయ‌మైపోతుందా? అలా అయినా కూడా మీ మొబైల్ హ్యాక‌ర్స్ బారిన ప‌డిన‌ట్టే.
4/9సాధారణంగా మొబైల్‌ను వినియోగిస్తుంటే వేడెక్కుతుంది. కానీ యూజ్‌ చేయకుండా పక్కన పెట్టినప్పుడు కూడా ఫోన్‌ వేడెక్కుతుందంటే అనుమానించాల్సిందే. మాల్‌వేర్‌ను ప్రేరేపించే యాప్స్‌ ఏవైనా ఉన్నప్పుడే ఇలా జరుగుతుందని గుర్తుపెట్టుకోండి.
5/9ముఖ్యంగా రోజు మొత్తం వ‌చ్చే డేటా తొంద‌ర‌గా అయిపోతున్నా అనుమానించాల్సిందేన‌ని అమెరికాకు చెందిన సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ సంస్థ నార్టన్‌ హెచ్చరిస్తుంది.
6/9డేటా అయిపోవ‌డంతో పాటు మొబైల్ బ్యాట‌రీ త్వరగా ఖాళీ అవుతుందంటే.. ఫోన్ హ్యాకింగ్‌కు గురైన‌ట్లేన‌ని నార్టన్‌ సంస్థ చెబుతోంది.
7/9సైబ‌ర్ నేర‌గాళ్లు ఫోన్‌ను హ్యాక్ చేసి ఏదైనా అప్లికేష‌న్లను చొప్పించిన‌ట్లయితే.. ఆ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప‌నిచేస్తూ ఉంటుంది. దీంతో ఆ భారం ఫోన్ ప్రాసెసింగ్ ప‌వ‌ర్ మీద ప‌డి ఫోన్ వేగం త‌గ్గిపోతుంది. కాబ‌ట్టి ఫోన్ స్పీడ్ త‌గ్గినా కూడా హ్యాకింగ్ గురైంద‌ని అనుమానించాల్సి ఉంటుంది.
8/9మీ మెయిల్ ఐడీ లేదా ఇత‌ర సోష‌ల్ మీడియా అకౌంట్లు.. మీకు సంబంధం లేని లొకేష‌న్లలో ఓపెన్ చేయ‌డానికి ప్రయ‌త్నించినట్లు గుర్తిస్తే కూడా వెంట‌నే అప్రమ‌త్తం అవ్వాలి.
9/9తెలియ‌ని నంబ‌ర్ల నుంచి మిస్‌డ్ కాల్స్ వ‌స్తుంటే.. ముఖ్యంగా ఇత‌ర దేశాల నంబ‌ర్ల నుంచి ఎక్కువ‌గా కాల్స్ వ‌స్తుంటే అప్రమ‌త్తం కావాల్సిందే. వెంట‌నే ఫోన్‌ను ఒక‌సారి చెక్ చేయించుకోవాలి.