న్యూఢిల్లీ : అఫర్డబుల్ స్పీకర్ మార్కెట్లో పేరొందిన బ్రాండ్ జెబ్రానిక్స్ (Zebronics) ల్యాప్‌టాప్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. ప్రొ సిరీస్ వై, ప్రొ సిరీస్ జెడ్ పేరుతో రూ. 27,990 ప్రారంభ ధరతో కంపెనీ ఐదు మోడల్స్‌ను లాంఛ్ చేసింది.
ల్యాప్‌టాప్స్‌లో డాల్బీ అట్మాస్ అద్భుత సౌండ్ ఎక్స్పీరియన్స్ అందించే తొలి ఇండియన్ బ్రాండ్‌గా జెబ్రానిక్స్ అరుదైన మైలురాయిని సాధించింది. జెబ్రానిక్స్ ప్రొ సిరీస్ జెడ్ ల్యాప్టాప్స్ ప్రీమియం ఈస్ధటిక్స్, స్లీక్ ప్రొఫైల్స్ ఫీచర్‌తో ఆకట్టుకుంటాయి.
టైప్ సీ పోర్ట్స్, వైఫై, బ్లూటూత్ 5.0, హెచ్డీఎంఐ, మైక్రో-ఎస్డీ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లతో కస్టమర్ల ముందుకొచ్చాయి. అవాంతరాల్లేని ప్రోడక్టివిటీ కోసం జెబ్రానిక్స్ భారీ బ్యాటరీని సమకూర్చింది. ఈ ల్యాప్‌టాప్స్‌పై టైపింగ్ డిలైట్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
Read More :
OnePlus Open | దేశీ మార్కెట్లో త్వరలో వన్‌ప్లస్ ఓపెన్ గ్రాండ్ ఎంట్రీ