న్యూఢిల్లీ : వన్‌ప్లస్ (OnePlus Open) తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ వన్ను భారత్‌లో త్వరలో లాంఛ్ చేయనున్నట్టు నిర్ధారించింది. లాంఛ్‌కు ముందు వన్‌ప్లస్ ఓపెన్ డిజైన్ టీజర్‌ను కంపెనీ ఆన్లైన్లో రివీల్ చేసింది. అక్టోబర్ చివరిలో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుందని వార్తలు రాగా, లేటెస్ట్గా ఈ హాట్ డివైజ్ ఇండియన్ ఎంట్రీని వన్‌ప్లస్ నిర్దారించింది. ఈ ఫోల్డబుల్ ఫోన్ పాక్షికంగా ఫోల్డ్ రూపంలో ఉన్న ఇమేజ్ను వన్‌ప్లస్ ట్విట్టర్లో షేర్ చేసింది. స్లీక్ బ్లాక్ కలర్ వేరియంట్లో వన్‌ప్లస్ ఓపెన్ ఆకట్టుకునేలా డిస్ప్లేలో కనిపించింది.
డివైజ్ ఎడమ వైపున అలర్ట్ స్లైడర్‌ను, కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ కనిపించాయి. నిజమైన వన్‌ప్లస్ ఎక్స్పీరియన్స్ సిద్ధంగా ఉంది..త్వరలో లాంఛ్ అంటూ ఇమేజ్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఇక వన్‌ప్లస్ ఓపెన్ భారత్ మార్కెట్లో రూ 1.2 లక్షలు ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో లీకయిన ఇమేజ్‌ల ప్రకారం ఫోన్ సర్క్యులర్ రియర్ కెమెరా మాడ్యూల్‌ను కలిగిఉంటుంది.
ఇక ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 7.82 ఇంచ్ ఓఎల్ఈడీ ఇన్నర్ స్క్రీన్, 6.31 ఇంచ్ ఓఎల్ఈడీ అవుటర్ డిస్ప్లేతో ఆకట్టుకుంటుంది. వన్‌ప్లస్ ఓపెన్ ఆక్టా-కోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. కెమెరా ఫీచర్లను చూస్తే వన్‌ప్లస్ ఓపెన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో 48 ఎంపీ ప్రైమరీ, 48 ఎంపీ సెకండరీ సెన్సర్లను కలిగిఉంటుంది. 3x ఆప్టికల్ జూమ్‌ను కల్పిస్తూ టెలిఫొటో లెన్స్‌తో కూడిన 64ఎంపీ సెన్సర్‌తో రానుందని అంచనా వేస్తున్నారు. 100డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్ చేస్తూ 4805ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది.
Read More :
Viral Video | నడిరోడ్డుపై యోగా చేసిన మహిళకు జరిమానా