Viral Video | నడిరోడ్డుపై యోగా చేసిన మహిళకు జరిమానా
డిజిటల్ మీడియా యుగంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు జనం మధ్య విన్యాసాలు చేస్తూ ఫాలోయర్లకు వినూత్న కంటెంట్ (Viral Video) అందిస్తున్నారు. ఈ విన్యాసాలు ఒక్కోసారి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుంటాయి.
అహ్మదాబాద్ : డిజిటల్ మీడియా యుగంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు జనం మధ్య విన్యాసాలు చేస్తూ ఫాలోయర్లకు వినూత్న కంటెంట్ (Viral Video) అందిస్తున్నారు. ఈ విన్యాసాలు ఒక్కోసారి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుంటాయి. ఇదే తరహాలో గుజరాత్‌లోని ఓ బిజీ రోడ్‌పై మహిళ యోగాసనాలు వేస్తుండగా పోలీసులు వీడియో తీశారు.
ఎరుపు రంగు దుస్తుల్లో దినా పర్మార్ అనే మహిళ నడిరోడ్డుపై యోగా చేస్తుండగా వాహనాల రాకపోకలకు అవాతంరం ఏర్పడింది. ఈ వీడియోను గుజరాత్ పోలీసులు ట్విట్టర్లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. వర్షం కురుస్తుండగా మహిళ రోడ్డు మధ్యలో స్ప్లిట్‌ను పెర్ఫామ్ చేస్తుండటం ఈ క్లిప్‌లో కనిపించింది.
ఆమె చేష్టలతో పలు వాహనాలు పర్మార్ వెనుక ఆగిపోవాల్సి వచ్చింది. ఆపై తన నిర్లక్ష్యపూరిత ప్రవర్తనకు పర్మార్ క్షమాపణలు చెప్పడం చూడొచ్చు. జరిమానా చెల్లించిన తర్వాత పర్మార్‌ను అధికారులు విడుదల చేశారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, బహిరంగ ప్రదేశాలను దుర్వినియోగం చేయరాదని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Read More :
Israel-Hamas War | మా భూభాగంలో 1500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలు.. ప్రకటించిన ఇజ్రాయెల్ సైన్యం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- fines
- Police
- Viral video
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

