హైదరాబాద్, జూలై 22: అద్దెకు విద్యుత్ వాహనాలు అందించే బెంగళూరుకు చెందిన యూలూ..తాజాగా హైదరాబాద్‌లో తన సేవలు ఆరంభించింది. ఈ సేవలను రాష్ట్ర ఐటీ ప్రీన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కంపెనీ కో-ఫౌండర్ నవీన్ దాచూరి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి స్విగ్గీ, బ్లింకిట్, జెప్టోతోపాటు ఇతర బ్రాండెడ్ డెలివరీ సంస్థలకు వాహనాలను లీజుకు ఇస్తున్నట్లు, భవిష్యత్తులో సాధారణ ప్రజలకు కూడా ఇచ్చే అవకాశం ఉన్నదన్నారు. గంటకు రూపాయి చొప్పున అద్దె వసూలు చేయనున్నారు.
లాభాల్లో దొడ్ల డెయిరీ
హైదరాబాద్, జూలై 22: దొడ్ల డెయిరీ ఆశాజనక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.65.02 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.34.97 కోట్లతో పోలిస్తే 86 శాతం వృద్ధి కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.918.53 కోట్లకు ఎగబాకింది.