మీరు పన్ను చెల్లింపుదారులా?.. మరింతగా పన్ను మినహాయింపుల కోసం అన్వేషిస్తున్నారా?.. అయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో పెట్టుబడులను పరిశీలించండి. ఇందులో పెట్టుబడులు పెడితే ఆదాయ పన్ను (ఐటీ) చట్టం 1961లోని సెక్షన్ 80సీ, 80డీ, 80టీటీఏల కింద ఆకర్షణీయ స్థాయిలోనే పన్ను ఆదా చేసుకోవచ్చు. ప్రతీ ఆర్థిక సంవత్సరం ఎన్పీఎస్లో రూ.2 లక్షలకుపైగా పెట్టుబడులను పెట్టుకోవచ్చు.
నిబంధనలకు లోబడి తమ బేసిక్ మంత్లీ సాలరీ ఆధారంగా ఈ పెట్టుబడిపై సెక్షన్ 80సీసీడీ(1), (1బీ), (2)ల కింద వ్యక్తులు తమ పన్ను కోతలను రూ.9.5 లక్షలదాకా క్లెయిమ్ చేసుకోవచ్చని ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వీటిలో పాత, కొత్త పన్ను విధానాలను ఎంచుకున్నా ప్రయోజనాలు పొందే వీలుండటం విశేషం.