Yamaha bikes | యమహా మోటార్ ఇండియా కొత్త ఫీచర్లతో 6 బైకులను సరికొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ 6 బైకులు కూడా 1500 సీసీ కావడం విశేషం. ఈ బైకులలో R15 V4, R15 M, MT 15 V2, FZ Fi V3, FZS Fi V4 డీలక్స్, FZX మోడల్స్ ఉన్నాయి. వీటిని ఇవాళ యూట్యూబ్ ఫ్లాట్‌ఫాంలో వర్చువల్‌గా కంపెనీ లాంచ్ చేసింది. ఆధునీకరించిన ఈ బైకులు E-20 కంప్లైంట్ పెట్రోల్‌కు మద్దుతు ఇస్తాయని కంపెనీ తెలిపింది.
ఈ కొత్త మోడళ్లో కంపెనీ కొన్ని ముఖ్యమైన డిజైన్ అప్డేట్లు. మెకానికల్ అప్‌గ్రేడ్స్ చేసింది. వీటికి వై కనెక్ట్ యాప్‌ను అందిస్తున్నది. ఈ యాప్‌తో బైక్-మొబైల్ ఒకదానికొకటి కనెక్ట్ అవుతాయి. ఇందులో బైక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్క్రీన్‌పై ఫోన్ నోటిఫికేషన్లను చూసే వీలుంటుంది. ఇందులో కాల్ అలర్ట్‌లు, ఎస్ఎంఎస్లు, ఈ మెయిల్, యాప్ కనెక్టివిటీ స్టాటస్, ఫోన్ బ్యాటరీ లెవల్ ఉంటాయి. అలాగే, ఫోన్లో బైక్ నోటిఫికేషన్లను చూడవచ్చు. ఫ్యూయల్ కంజప్షన్ ట్రాకర్, మెయింటెనన్స్ రికమండేషన్, చివరి పార్కింగ్ లొకేషన్, revs డాష్‌బోర్డ్, ర్యాంకింగ్ ఉన్నాయి.
R15 M రేసింగ్ బైక్ ధర రూ.1,93,900 గా నిర్ణయించారు. ఇది మెటాలిక్ గ్రే కలర్ ఆప్షన్‌తో లభిస్తున్నది. R15 V4 మాదిరిగా ఇంజిన్ కలిగి ఉంటుంది. R15 V4 రేసింగ్ బ్లూ ధర రూ.1,85,900, డార్క్ నైట్ ధర రూ.1,81,900, మెటాలిక్ రెడ్ ధర రూ.1,80,900 గా ఉన్నది. MT 15 V2 ధర రూ.1,68,400 గా నిర్ణయించారు. ఇందులో నాలుగు రంగుల ఆప్షన్లో బైకులు అందుబాటులో ఉన్నాయి. FZ Fi V 3 బైకు ధర రూ.1,13,700 గా ఉన్నది. ఇందులో రేసింగ్ బ్లూ, మెటాలిక్ బ్లూ రంగుల్లో దొరుకుతాయి. FZ-X డార్క్ మట్టే బైకు ధర రూ.1,36,900 గా ఉండగా, మట్టే కాపర్, మట్టే బ్లాక్ బండ్లు రూ.1,35,900 గా నిర్ణయించారు. FZS Fi V4 మెటాలిక్ బ్లాక్ బైక్, మెటాలిక్ గ్రే, మెజెస్టీ రెడ్ రంగుల్లో దొరుకుతాయి. వీటి ధర రూ.1,27,400 గా ఉన్నది.