Yamaha R15M | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యమహా దేశీయ మార్కెట్లోకి కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ గ్రాఫిక్ తో యమహా ఆర్15ఎం మోటారు సైకిల్ తీసుకొచ్చింది. యమహా ఆర్15 ఎం మోటారు సైకిల్ 155సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 18.35 బీహెచ్పీ విద్యుత్, 14.7 ఎన్ఎం టార్క్ వెలువరించడంతోపాటు క్విక్ షిఫ్టర్, 6-స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తోంది. టర్న్ బై టర్న్ నేవిగేషన్, యమహా వై- కనెక్ట్ యాప్ ద్వారా మ్యూజిక్ అండ్ వాల్యూమ్ నియంత్రణ కోసం న్యూ స్విచ్ గేర్, లైసెన్స్ ప్లేట్ కోసం ఎల్ఈడీ లైట్ ఉంటాయి.
లెజెండరీ ఆర్1ఎం కార్బన్ బీడీ వర్క్ స్ఫూర్తితో రూపుదిద్దుకున్న యమహా ఆర్15 ఎం మోటారు సైకిల్ న్యూ కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ కలిగి ఉంటుంది. మోడర్న్ వాటర్ డిప్పింగ్ టెక్నాలజీతో తయారైంది యమహా ఆర్15ఎం. ఆల్ బ్లాక్ ఫెండర్, ట్యాంకు, సైడ్స్ మీద న్యూ డెకల్స్, రెండు వైపులా బ్లూ వీల్స్ ఉంటాయి. ఫ్యాబ్రిక్ ఫైబర్ ఫ్యాటర్న్ లో యమహా ఆర్15 ఎం మోటారు సైకిల్ రూ.2.08 లక్షలు (ఎక్స్ షోరూమ్), మెటాలిక్ గ్రే ఆప్షన్ లో రూ.1.98 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.