చెన్నై, జూలై 14: యమహా మోటర్స్ దేశీయ మార్కెట్లోకి నయా బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. హైబ్రిడ్ ఇంజిన్ టెక్నాలజీతో రూపొందించిన ఎఫ్‌జెడ్-ఎక్స్ 2025 మాడల్ ధర రూ.1,49,990గా నిర్ణయించింది.
ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. దీంతోపాటు ఎఫ్‌జెడ్-ఎక్స్(నాన్-హైబ్రిడ్) సైతం విడుదల చేసింది. ఈ బైకు ధర రూ.1,29,990 గా నిర్ణయించింది.