Xiaomi 15 Ultra | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన షియోమీ 15 ఆల్ట్రా (Xiaomi 15 Ultra) ఫోన్ ను త్వరలో ఆవిష్కరించనున్నది. గతేడాది ఆవిష్కరించిన షియోమీ 14 ఆల్ట్రా ఫోన్ కొనసాగింపుగా షియోమీ 15 ఆల్ట్రా వస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్ మార్కెట్లోకి షియోమీ 15 ఆల్ట్రా వస్తోంది. షియోమీ 15 ఆల్ట్రా ఫోన్ మూడు వేర్వేరు రేర్ ప్యానెల్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. యూజర్లు సిరామిక్స్, గ్లాస్, ఫాక్స్ లెదర్ ఆప్షన్లలో తమకు నచ్చిన ప్యానెల్ ఎంచుకోవచ్చు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్ తో రానున్నది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ అండ్ న్యూ పెరిస్కోప్ కెమెరాతోపాటు క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుందని తెలుస్తోంది.
గత ఫిబ్రవరిలో జరిగిన ఎండబ్ల్యూసీ 2024లో షియోమీ 14 ఆల్ట్రా ఆవిష్కరించారు. మార్చిలో 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ ఆప్షన్ తో భారత్ మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధర రూ.99,999 పలికింది. షియోమీ 15 ఆల్ట్రా కూడా ఒక ర్యామ్ – ఒక స్టోరేజీ ఆప్షన్ తో వస్తుందని భావిస్తున్నారు.
షియోమీ 14 ఆల్ట్రా ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.73 అంగుళాల డబ్ల్యూహెచ్డీ + ఎల్టీపీఓ అమోలెడ్ మైక్రో కర్వ్డ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుంది. 90 వాట్ల వైర్డ్, 80 వాట్ల వైర్ లెస్, 10 వాట్ల రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.