సోమవారం 01 మార్చి 2021
Business - Feb 18, 2021 , 01:54:49

విద్యార్థులకు వండర్‌లా ఆఫర్‌

విద్యార్థులకు  వండర్‌లా ఆఫర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17: ప్రముఖ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ నిర్వహణ సంస్థ వండర్‌లా..కళాశాల విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. 2020-21 విద్యా సంవత్సరంలో కళాశాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎంట్రీ టిక్కెట్‌పై 15 శాతం తగ్గింపు పొందవచ్చునని తెలిపింది. దీంతో టిక్కెట్‌  రూ.849(జీఎస్టీతో సహా) చెల్లిస్తే సరిపోతున్నదని తెలిపింది. పార్క్‌లోకి ప్రవేశించే ముందుగా కళాశాల విద్యార్థులు తమ ఐడీ కార్డును చూపించి ఈ రాయితీ పొందవచ్చునని సూచించింది. మార్చి 31 వరకు ఈ ప్రత్యేక ఆఫర్‌ అమలులో ఉండనున్నది. ప్రస్తుతం ఈ పార్క్‌ బుధవారం నుంచి ఆదివారం వరకు మాత్రమే తెరిచివుంటున్నది. 


VIDEOS

తాజావార్తలు


logo