Make in India | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): దేశంలో తయారీ రంగానికి ఊతమివ్వాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఆర్భాటంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా.. జోక్ ఇన్ ఇండియాగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ కూడా దేశీయ తయారీ రంగ వృద్ధి మందగించిందని సర్వేలో వెల్లడించింది. గత నెలకుగాను మాన్యుఫ్యాక్చర్ పీఎంఐ ఇండెక్స్ 57.8కి పడిపోయిందని తెలిపింది.
అంతక్రితం నెలలో 58.7గా నమోదైంది. ఎగుమతులు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమని విశ్లేషించింది. ప్రధానంగా ద్రవ్యోల్బణం, కార్మికుల ఖర్చులతోపాటు ఉత్పత్తి వ్యయాలు పెరిగాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఉత్పాదకతలో పెరిగిన ఖర్చులను అంతర్జాతీయ మార్కెట్కు ధీటుగా తగ్గించుకుని, పోటీ తత్వంతో సరసమైన ధరలకు ఉత్పత్తులను అందించగలిగినప్పుడే వినియోగదారుల కొనుగోళ్ళు పెంచుకునే అవకాశముంటుందని ఆ సంస్ధ ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డీ లిమా అభిప్రాయపడ్డారు.