Wipro | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10 వేల నుంచి 12 వేల మంది ఉద్యోగులను నియమించుకుంటామని ఐటీ మేజర్ విప్రో ప్రకటించింది. ఇప్పటి వరకూ సంస్థలో ఉన్న ఖాళీలను ఈ ఏడాది భర్తీ చేస్తామని విప్రో సీహెచ్ఆర్ఓ సౌరవ్ గోవిత్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికంలో నికర లాభాల్లో 4.6 శాతం వృద్ధితో రూ.3,003.2 కోట్ల నికర లాభం సాధించినట్లు విప్రో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నట్లు వివరించింది. విప్రో ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో గురువారంతో పోలిస్తే సంస్థ షేర్ 2.78 శాతం పతనంతో బీఎస్ఈలో రూ.557.25 వద్ద ముగిసింది.
ఈ నేపథ్యంలో క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ నియామకాల ద్వారా కొత్త ఉద్యోగులను నియమించుకుంటామని విప్రో వెల్లడించింది. జూన్ నెలాఖరు నాటికి కంపెనీలో 2,34,391 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుత త్రైమాసికంలోనే మూడు వేల నియామకాలు చేపడతామని వివరించింది. గ్లోబల్ బేస్డ్ డిమాండ్ కు అనుగుణంగా నిపుణులను నియమించుకుంటామని సౌరవ్ గోవిల్ తెలిపారు. విప్రోతోపాటు ఐటీ మేజర్లుగా ఉన్న ఇన్ఫోసిస్, టీసీఎస్ 20 వేల నుంచి 40 వేల మంది ఉద్యోగులను నియమించుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Citroen Basalt | టాటా కర్వ్కు గట్టి పోటీ..ఆగస్టు 2న భారత్ మార్కెట్లోకి సిట్రోన్ బసాల్ట్..!
Bajaj Bikes – Flipkart | ఫ్లిప్ కార్ట్ ద్వారా బజాజ్ మోటారు సైకిళ్లకు ఆర్డర్లు.. !
Mahindra 5-Door Thar | ఆగస్టు 15న మార్కెట్లోకి మహీంద్రా 5-డోర్.. ఇవీ స్పెసిఫికేషన్స్..!
Gold Rates | భారీగా తగ్గిన బంగారం ధర.. అదే బాటలో వెండి.. కారణమిదేనా..?!
Google Pixel 9 Pro | గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం.. ఎప్పుడంటే..?!
Poco M6 5G | కొత్త వేరియంట్ లో పోకో ఎం6జీరామ్..ధరెంతంటే..?