న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: మూన్‌లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులపై ప్రముఖ టెక్నాలజీ సంస్థ విప్రో కన్నెర్ర చేసింది. ఒకే సమయంలో రెండు సంస్థల్లో పనిచేసిన 300 మంది సిబ్బందిని గుర్తించి, వారిని తమ ఉద్యోగం నుంచి తొలగించినట్లు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తెలిపారు.
ఒకే సమయంలో తమ పోటీ సంస్థల్లోనూ విధులు నిర్వహిస్తున్నవారిని ఉపేక్షించేది లేదని, వారిని ఉద్యోగాల్లో తీసివేసినట్లు ఢిల్లీలో జరుగుతున్న ఏఐఎంఏ సదస్సులో ఆయన చెప్పారు. ఇంటి నుంచి పనిచేస్తున్న వారిలో కొంత మంది సిబ్బంది ఇతర ఐటీ సంస్థలకు అదే సమయంలో సేవలు అందిస్తున్నారని, వీరిని గుర్తించినట్లు తెలిపారు.