గురుగ్రామ్, జూలై 12: వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్ఫాస్ట్ అనుబంధ సంస్థయైన విన్ఫాస్ట్ ఆటో ఇండి యా.. దేశవ్యాప్తంగా తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా 32 షోరూంలను తెరిచేందుకు 13 డీలర్ల గ్రూపులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంలో భాగంగా 27 నగరాల్లో 32 షోరూంలను తెరుస్తున్నది.
ఈ ఒప్పందంలో భాగంగా ఒకేచోట 3ఎస్ (సేల్స్, సర్వీసెస్, స్పేర్లు) అందించడంతోపాటు వీఎఫ్ 6, వీఎఫ్7 మా డళ్లను ఈ నెల 15 నుంచి ముందస్తు బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఢిల్లీతోపాటు గురుగ్రామ్, నోయిడా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణె, జైపూర్, అహ్మదాబాద్, కోల్కతా, కొచ్చిన్, భువనేశ్వర్, తిరువనంతపురం, ఛండీగఢ్, లక్నోల్లో డీలర్షిప్లను నెలకొల్పబోతున్నది. ఈ నగరాల్లో ఈవీ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉన్నదని, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, చార్జింగ్ స్టేషన్లు అధికంగా ఉండటం వల్లనే వీటిని ఎంపికచేసినట్టు విన్ఫాస్ట్ ఆసియా సీఈవో ఫామ్ సన్హా చౌ తెలిపారు.