Windfall Tax | న్యూఢిల్లీ, ఆగస్టు 31: ముడి చమురుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గించింది. టన్ను ధరను రూ.250 తగ్గించడంతో రూ.2,100 నుంచి రూ.1,850కి దిగొచ్చింది.
తగ్గించిన ధరలు శనివారం నుంచే అమల్లోకి వచ్చాయని పేర్కొంది. విదేశాలకు ఎగుమతి అవుతున్న ఇంధనాలపై వస్తున్న లాభాలపై విధిస్తున్న ఈ విండ్‌ఫాల్ ట్యాక్స్ జూలై 1, 2022 నుంచి కేంద్ర సర్కార్ అమల్లోకి తెచ్చింది.