న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు పొందలేకపోతే వెంటనే 1915 టోల్-ఫ్రీ నంబర్, 880000 1915కి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కేంద్రం సూచించింది. జీఎస్టీ తగ్గింపుతో ఈ ప్రయోజనాలను ఆయా సంస్థలు కొనుగోలు దారులకు చేరవేయడం లేదని వస్తున్న ఫిర్యాదులపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ) ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్, వాట్సాప్ నంబర్‌తో ఫిర్యాదు చేయవచ్చునని సూచించింది.
ఈ నెల 22 నుంచి జీఎస్టీ 5 శాతం, 18 శాతం స్లాబులకు కుదించిన విషయం తెలిసిందే. గతంలో 5, 12, 18, 28 శాతంగా ఉన్న స్లాబులు ప్రస్తుతం రెండింటికి కుదించారు. దీంతో 99 శాతం వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టాయి.