న్యూఢిల్లీ, జూలై 30: తమ చిప్సెట్తో భారత్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,000, అంతకన్నా దిగువకు చేరగలదని అమెరికా చిప్ తయారీ దిగ్గ జం క్వాల్కామ్ అన్నది. మంగళవారం స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జెన్ 2 చిప్‌సెట్‌ను సంస్థ ఆవిష్కరించింది.
ఆరంభ శ్రేణి మొబైల్ ఫోన్ల కోసం తెచ్చిన ఈ చిప్‌తో భారత్‌లోని 60 కోట్లకుపైగా మొబైల్ వినియోగదారులకు చౌక ధరలకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకునే వీలు కలుగుతుందన్న విశ్వాసాన్ని క్వాల్కామ్ వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.9,999 గా ఉన్నది. ఈ క్రమంలో క్వాల్కామ్ ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. డిసెంబర్‌లోగా షియామీ తదితర బ్రాండ్లు చౌక స్మార్ట్ఫోన్లను తీసుకురాచ్చని అంచనా.