Gold Rates | న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. ప్రస్తుత పండుగ సీజన్లో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టిన బంగారం ఎట్టకేలకు శాంతించింది. తన తొమ్మిది వారాలుగు పెరుగుతూ వచ్చిన ర్యాలీకి డాలర్ బలపడటం, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతో భారీగా పడిపోయాయి.
మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో డిసెంబర్ నెల డెలివరీకిగాను తులం ధర రూ.3,557 లేదా 2.80 శాతం తగ్గి రూ.1,23,451గా నమోదైంది. అలాగే కిలో వెండి రూ.9,134 లేదా 5.83 శాతం తగ్గి రూ.1,47,470కి చేరాయి. ఆగస్టు 22 నుంచి పెరుగుతూ వచ్చిన తులం బంగారం ధర రికార్డు స్థాయి రూ.1,32,294కి చేరుకోగా, కిలో వెండి రూ.1,70,415 పలికింది.